ఆఫ్ఘనిస్థాన్‌తో చివరి వన్డేకు భారత జట్టులో కొత్త ముఖం

  • జట్టులోకి యువ బౌలర్‌ హర్షిత్ రాణా
  • గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బౌలర్‌
  • బీసీసీఐ అధికారిక ప్రకటన
  • ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ టూర్లకూ ఎంపికైన హర్షిత్‌
  • ఆప్ఘన్‌తో సిరీస్‌ కైవసమైన నేపథ్యంలో యువకులకు అవకాశాలు
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మూడో వన్డేకు ముందు భారత జట్టులో మార్పు చోటుచేసుకుంది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్‌ రాణాను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. శనివారం చెన్నై వేదికగా జరిగే చివరి మ్యాచ్‌లో రాణా కూడా జట్టుతో ఉండనున్నాడు.

టీ20 ప్రపంచకప్‌నకు ముందు ముంబైలో జరిగిన వార్మప్ మ్యాచ్ సందర్భంగా హర్షిత్ మోకాలికి గాయమైంది. దీంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌లో కూడా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడే అవకాశం కోల్పోయాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న హర్షిత్ ఇటీవల బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశాడు. అనంతరం చెన్నైలో ఉన్న భారత జట్టుతో చేరినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.

24 ఏళ్ల హర్షిత్ రాణా ఇప్పటివరకు భారత్ తరఫున 14 వన్డేలు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 27.38 కాగా ఎకానమీ 6.21గా ఉంది. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారిగా భారత జెర్సీలో కనిపించాడు. ప్రస్తుతం అతడిని ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ పర్యటనలకూ ఎంపిక చేశారు. ఆ పర్యటనల్లో భారత్ ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

మూడో వన్డేకు ముందు హర్షిత్ జట్టులో చేరడం వల్ల భారత బౌలింగ్ విభాగానికి మరింత బలం చేకూరనుంది. సిరీస్ ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నారు.

Harshit Rana
India vs Afghanistan
BCCI
Indian Cricket Team
ODI Series
Chennai ODI

More Telugu News